Aug 15,2023 22:20

వీరఘట్టంలో జాతీయ జెండాను ఊరేగిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : దేశం కోసం సర్వస్వం అర్పించిన త్యాగధనుల స్ఫూర్తితో దేశ పౌరులకు సేవలు అందించేందుకు జాతికి అంకితం కావాలని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వివిధ విభాగాలు, జిల్లా పోలీస్‌ కార్యాలయం సిబ్బంది ఎస్బి, డిసిఆర్బి సిబ్బంది పాల్గొని జెండా వందనం చేసినారు. జెండావందన కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఒ. దిలీప్‌ కిరణ్‌ గారు, ఎఎస్పీ సునీల్‌ షరోన్‌., ఐపిఎస్‌ గారు, ఎఆర్‌ ఆర్‌ఐలు శ్రీరాములు, కుమార్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలో...
స్థానిక న్యాయస్థానాల సముదాయ ప్రాంగణంలో రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్‌ దామోదర్‌ రావు జాతీయ పథకావిష్కరించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి జి యజ్ఞ నారాయణరావు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఏ రమేష్‌ తో పాటు సిబ్బంది సీనియర్‌ న్యాయవాదులు న్యాయవాదులు పాల్గొన్నారు.
డిఎఫ్‌ఒ కార్యాలయంలో...
స్థానిక జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో డిఎఫ్‌ఒ జిఎపి ప్రసూన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పలుచోట్ల సంచరిస్తున్న వన్యప్రాణులతో పాటు ఆయా ప్రాంత ప్రజల సంరక్షణకు అహర్నిశలు కషి చేయాలని కోరారు. కార్యక్రమం లో పార్వతీపురం, పాలకొండ డివిజన్‌ రేంజ్‌ అధికారులు ఫారెస్ట్పా రేంజ్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మండలంలో పలుచోట్ల
మండలంలోని పలుచోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్‌ శివన్నారాయణ, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి మజ్జి శోభారాణి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ జి.రామారావు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే చిన్న బండపల్లి ఎంఇపి స్కూల్లోలో సర్పంచి గండి శంకరరావు, వైస్‌ ఎంపిపి బంకుర రవికుమార్‌ పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వెంకంపేటలో జరిగిన కార్యక్రమంలో సర్పంచి తీళ్ల కృష్ణారావు, వైస్‌ ఎంపిపి సిద్ధా జగన్నాధ రావు, అడ్డాపు సీల పంచాయతీ కోటవానివలసలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్‌ గౌతమి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో భాగంగా గ్రామంలో సేవలు అందిస్తున్న పూడి వెంకటనాయుడు మాస్టర్‌ సేవలను కొనియాడుతూ గ్రామ యువత సన్మానించారు. పెద్దబొండపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు పాఠశాల విద్యార్థుల వినియోగార్ధం మొక్కలు అందించారు.
ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో...
స్థానిక మెయిన్‌ రోడ్డు పాతబస్టాండ్‌ ఆవరణలో జై దుర్గా భవానీ ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వేడుకల్లో. యూనియన్‌ అధ్యక్షుడు, ఎస్‌ యుగందర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, ఎస్‌ చిన్నా, సెక్రటరీ సిహెచ్‌ నర్సింహులు, కె రాజు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
పాలకొండ : స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ జెండా ఆవిష్కరించగా, స్థానిక డిఎస్‌పి కార్యాలయం దగ్గర డిఎస్‌పి జి.కృష్ణారావు, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద ఎంఎల్‌సి పాలవలస విక్రాంత్‌, స్థానిక కోర్టులో జడ్జి విజరుమోహన్‌, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ సోమేశ్వరరావు, పోలీస్‌స్టేషన్‌ లో సిఐ జి.మురళీధర్‌, ఫారెస్టు కార్యాలయంలో ఫారెస్టు రేంజర్‌ తవిటినాయుడు, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి బొమ్మాళిభాను, నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ యందవ రాధాకుమారి జెండా ఆవిష్కరించారు. స్థానిక ఆటో స్టాండ్‌ దగ్గర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు జెండా ఆవిష్కరించారు. టిడిపి కార్యాలయం వద్ద టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ జెండా ఎగురవేశారు.
ఐటిడిఎ వద్ద...
బెలగాం : స్థానిక ఐటిడిఎ కార్యాలయం వద్ద పిఒ సి.విష్ణుచరణ్‌ జాతీయ పతాకాన్ని విష్కరించారు. ఈ సందర్బంగా ఐటిడిఎ ప్రగతిని చదివి వినిపించారు. అనంతరం పలువురు అధికారులకు ప్రసంపాపత్రాలను అందజేశారు.
సాలూరు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ జెండా ఆవిష్కరణ చేశారు. వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, ఇంఛార్జి కమిషనర్‌ రాఘవాచార్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో తహశీల్దార్‌ బాలమురళీకష్ణ, టౌన్‌ సిఐ కార్యాలయం ఆవరణలో సిఐ సిహెచ్‌.శ్రీనివాసరావు, అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంక్‌ లో అధ్యక్షుడు జర్జాపు ఈశ్వరరావు, ఫారెస్టు రేంజ్‌ కార్యాలయం లో రేంజ్‌ అధికారి కె.రామారావు, సిసి కార్యాలయం లో బిఎం జె.రామారావు, శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల లో ప్రముఖ వ్యాపారవేత్త మండవిల్లి వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు. లయన్స్‌ క్లబ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ లో క్లబ్‌ అధ్యక్షుడు కర్రి వెంకట్రావు పతాకావిష్కరణ చేశారు.ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
బలిజిపేట : స్థానిక పోలీస్‌ స్టేషన్‌, మండల పరిషత్‌ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ ఆయా అధికారులు, ఎంపిపి గుడివాడ నాగమణి, జెడ్‌పిటిసి అలజంగి రవికుమార్‌ సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ విజయలక్ష్మి, తహశీల్దార్‌ అప్పలరాజు, ఎస్సై ఎన్‌.ప్రశాంత్‌ కుమార్‌, ఇతర మండల స్థాయి అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
సీతానగరం : మండలంలోని పలు గ్రామాల్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి రవణమ్మ జెండాను ఎగరవేశారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ ఎన్‌వి రమణ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ప్రిన్సిపల్‌ త్రినాధ, అంబేద్కర్‌ గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపల్‌ జి.ఈశ్వరరావు, జెడ్పీ హైస్కూల్‌ వద్ద హెచ్‌ఎం ఇ. ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు. సీతానగరం, పెదలంకలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు కె.శిరీష, ఎం.రాధాకాంత్‌ ఆధ్వర్యంలో జెండాలు ఎగరవేశారు. గ్రామ సచివాలయాల వద్ద ఆయా గ్రామ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు జెండాలు ఎగరవేశారు.
సీతంపేట : స్థానిక మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ కొండపల్లి సత్యం, పెద్దూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు నెల్లి సత్యం, నాయుడు హెచ్‌ఎం ప్రసాదు, భారతి ఇంటర్నేషనల్‌ స్కూల్లో ప్రిన్సిపల్‌ నవీన్‌ కుమార్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
కురుపాం : స్థానిక కోర్టు ఆవరణలో ఇన్‌ఛార్జి న్యాయమూర్తి డి.సౌజన్య జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిడిఒ వివి శివరామప్ప, రెవెన్యూ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ ఆర్‌.రమేష్‌ కుమార్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో డిఇ కె..నాగేశ్వరరావు, అటవీ శాఖ కార్యాలయంలో రేంజర్‌ పి. ఏడుకొండలు, పలు పాఠశాలల్లో, గ్రామ సచివాలయల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
విజ్ఞాన భారతిలో జెండా ఆవిష్కరించిన వీరేశ్‌ చంద్ర దేవ్‌
టిడిపి నాయకులు వైరచర్ల వీరేశ్‌ చంద్ర దేవ్‌ స్థానిక విజ్ఞాన భారతి పాఠశాల వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జెండాను ఎగరవేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి జెండాన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : స్థానిక మండల పరిషత్‌ అభివద్ధి కార్యాలయం వద్ద ఎంపిపి ఉరిటి రామారావు పతాకావిష్కరణ చేశారు. అలాగే రాయవలస గ్రామ సచివాలయంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాపూజీ నాయుడు, శాఖ గ్రంథాలయం వద్ద సర్పంచ్‌ కలిశెట్టి ఇందుమతి, నాగూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌ కేతిరెడ్డి శిరీష పతాకావిష్కరణ చేశారు. స్థానిక వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేట్‌ డీన్‌ ఇంచార్జి ఆర్‌.రాజ్యలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు.కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలో వాడ వాడల ఘనంగా జరిగాయి. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఆవరణంలో ఎంపిపి కె.దీనమయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే స్థానికప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ టి. శ్రీవరం,
చింతలగూడ ఎయిడెడ్‌ పాఠశాలలో సర్పంచి బొత్తాడ గౌరీ శంకరరావు, ఎల్విన్‌ పేట సచివాలయం వద్ద సర్పంచి ఆర్‌ చైతన్య స్రవంతి జెండా ఆవిష్కరించారు. ఉత్తమ ఉద్యోగులను సన్మానించి బహుమతులు అందజేశారు. ఎల్విన్‌ పేట మైక్రో వాటర్‌ షెడ్‌ ఆధ్వర్యంలో ఎస్‌కె పాడు గ్రామ సమీపంలో సర్పంచి చైతన్య స్రవంతి, చెముడుగూడ ఎంపిటిసి మండంగి రమణ మొక్కలు నాటారు. మహాత్మా గాంధీ విగ్రహానికి సిఐ సత్యనారాయణ పూలమాలవేసి నివాళులు అర్పించారు. వర్తక సంఘం, ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, సచివాలయాలు ఆవరణంలో జాతీయ జెండా ఎగరవేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలోని వండవ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి జాతీయ పతాకాని ఆవిష్కరించారు. రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్‌ సిహెచ్‌ సత్యనారాయణ, పోలీస్‌ స్టేషన్లో ఎస్‌ఐ ఎం.వెంకటరమణ, డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌ సిహెచ్‌ సుధాకర్‌ రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎం.కుమారస్వామి, వీరఘట్టం, బిటివాడ పిహెచ్‌సిల్లో వైద్యాధికారులు జనార్దన్‌రావు, మానస, మేజర్‌ పంచాయతీలో సర్పంచ్‌ పి.గౌరమ్మతో పాటు అన్ని పాఠశాలల్లో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరఘట్టంలోని శ్రీ గాయత్రి పాఠశాల, జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో 200 మీటర్ల గల జాతీయ త్రివర్ణ పతాకం, వివిధ రకాల వేషధారణతో విద్యార్థులను వాహనంపై ఎక్కించి మండల విద్యాశాఖ కార్యాలయం నుండి ప్రధాన రహదారి మీదుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే బిటివాడ ,నీలానగరం కంబర వలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులు వివిధ రకాల విన్యాసాలు చేపట్టారు.
సాలూరురూరల్‌ : స్తానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఎంపిపి జి.రాములమ్మ, ఎంపిడిఒ ఎ.రమాదేవి, ఎఎంసి చైర్‌పర్సన్‌ దండి అనంత కుమారి, వైస్‌ఎంపిపి సువ్వాడ గుణవతి, ఎపిఎం సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రా ఒడిస్సా వివాదస్పద గ్రామాల్లోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టుచేన్నురు సర్పంచ్‌ సిదారపు కామీ, బెతురి, కార్యదర్శి కర్ర శ్రీను ఉపాధ్యాయులు గణేష్‌ విద్యార్ధి విద్యార్దులు పాల్గొన్నారు
పాచిపెంట : మండలంలో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ రాజశేఖర్‌, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి బి.ప్రమీల, స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్సై ఫక్రుద్దీన్‌ జాతీయ జెండాను ఎగువేశారు. అలాగే చిన్న బజారు కూడలి వద్ద వైసిపి నాయకులు డోల బాబ్జీ, కొత్తవలస పాఠశాల వద్ద సర్పంచ్‌ ఇజ్జడ అప్పలనాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలో పలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
భామిని : మండలం లోని పాఠశాలలు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి తోట శాంతికుమారి సచివాలయం, లైబ్రరీ, పాఠశాలలో సర్పంచ్‌ లోపింటి రాజేశ్వరి, కె జి బి వి పాఠశాలలో చైర్మన్‌ పోతల చంద్రభూషణ, రెవెన్యూ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ నీలపు అప్పారావు, మనుమకొండ ఆశ్రమం పాఠశాల వద్ద సర్పంచ్‌ కేశవ, పెద్దిదిమిలి సచివాలయం వద్ద పాశర్ల రామారావు, తోఘరానా శ్రీను, బిల్లుమడ సచివాలయం వద్ద సిగడానా రాజు జాతీయ జెండా ఎగురావేశారు. ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ రఘుపాత్రుని శివకుమార్‌ ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు లో భాగంగా నిర్వహించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బైక్‌ ర్యాలీ
గుమ్మలక్ష్మీపురం : 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని కేదారి పురం పంచాయతీలో సర్పంచి తులసమ్మ ఆధ్వర్యంలో సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, వార్డు మెంబర్లు, విద్యార్థులతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ జెండా ఎగరవేస్తూ స్వాతంత్య్ర గురించి, స్వాతంత్ర సమరయోధులు గురించి అందరికీ తెలియజేశారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నిండాలని, మంచి పౌరులుగా గుర్తింపు పొందాలని ఉద్దేశంతో బైక్‌ ర్యాలీ నిర్వహించినట్లు పంచాయతీ కార్యదర్శి బి సురేష్‌ తెలిపారు.
మక్కువ: మండలంలోనిస్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎంపిపి మర్రి పారమ్మ, జెడ్‌పిటిసిసభ్యులు శ్రీనివాసరావు, వైసిపి నాయకులు రంగనాయుడు, టిడిపి నాయకులు మావుడి ప్రసాదరావునాయుడు లు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని జెండా వందన సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో స్థానిక తహశీల్దారు సూర్యనారాయణ, డిటి ఇబ్రహీం, ఎంపిడిఒ సూర్యనారాయణ, ఇఒపిఆర్‌డి డి.దేవకుమార్‌, ఎంఇఒలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ పైడిరాజు ఆయా కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించారు.