Sep 28,2023 10:52

ప్రజాశక్తి-ఉంగుటూరు : మండలం నారాయణపురంలో గురువారం ఉదయం యుటిఎఫ్ పతాకావిస్కరణ జరిగింది. శ్రీకాకుళంలో ప్రారంభమైన యుటిఎఫ్ 50సం. ప్రచార జాత పశ్చిమగోదావరి జిల్లా నుండి ఏలూరు జిల్లా నారాయణపురం బుధవారం రాత్రి  చేరుకుంది. గురువారం ఉదయం యుటిఎఫ్ పతాకావిస్కరణ సీనియర్ నాయకులు పి.వి.నరసింహ రావు, కనకదుర్గ చేసారు. యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్. ఎస్ .ప్రసాద్ మాట్లాడుతూ యుటిఎఫ్ యాబై సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేసిందని అన్నారు. యుటిఎఫ్ ప్రచారజాత నారాయణపురం నుండి ప్రారంభమై భీమడోలు, ద్వారకాతిరుమల,జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఏలూరు మీదుగా హనుమాన్ జంక్షన్ కు చేరుకుంటుందని యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి గోపిమూర్తి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆలీ, రవికుమార్ ,రంగవల్లి తెలియజేసారు. ఉంగుటూరు మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వునుమల రాంబాబు,డాకి జోగినాయుడు శీతాల సత్యనారాయణ, శ్రీధర్, కమల్, హరికృష్ణ, వాణి, ఆనంద్, ఉంగుటూరు సీనియర్ నాయకులు ఉప్పిలి వెంకటేశ్వరరావు,అల్లు శ్రీను పాల్గొన్నారు.