Sep 21,2023 21:24

కురుపాం సంతలో ప్రచారం చేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, నాయకులు

కురుపాం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ఉక్కు రక్షణ యాత్ర సిపిఎం ఆధ్వర్యంలో చేపడుతున్న బైక్‌ యాత్రను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. గురువారం స్థానిక వారపు సంత, విద్యాసంస్థలు, బజార్లు వద్ద సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే బైక్‌ ప్రచార యాత్ర కార్యక్రమానికి ముఖ్య తిరిగే ఆయన హాజరై కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని రక్షించుకొనేందుకు ఈ ప్రాంత ప్రజలు గత వెయ్యి రోజులకు పైగా పోరాడుతున్నారని అన్నారు. ఈ పోరాటంలో సిపిఎం తన వంతు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 20 నుండి 29 వరకు ఉత్తరాంధ్ర బైక్‌ యాత్ర చేపట్టిందని, ఇందులో భాగంగా ఈనెల 24న రావాడ జంక్షన్‌ వద్ద బైక్‌ యాత్ర చేరుకుంటుందని అన్నారు. అక్కడ సభ ఉంటుందని ఆ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం, ఉత్తరాంధ్ర నాయకులు, జిల్లా కార్యదర్శులు పాల్గొంటారని తెలిపారు. కావున ఆ సభకు నియోజకవర్గంలో గల ప్రజలు, యువత అక్కడికి చేరుకొని బైక్‌ యాత్రను సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్‌.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. సాలూరు రూరల్‌ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకై జరుగుతున్న ఉక్కు రక్షణ బైక్‌ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని బాగువలసలో సిపిఎం ఆధ్వర్యంలో గోడపత్రిక విడుదల చేసి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కూనేటి చినబాబు, కంచూరి బంగార్రాజు, గబడారు శ్రీను తదితరులు పాల్గొన్నారు. సీతానగరం : ఉక్కు రక్షణ బైక్‌ యాత్ర జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మునాయుడు, మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో గోడపత్రిక విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు జి.వెంకటరమణ, రెడ్డి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కొమరాడ : కేంద్రంలో మోడీ ప్రభుత్వం దోహాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి కోరారు. ఉక్కు రక్షణ యాత్రనును జయప్రదం చేయాలని కోరుతూ కొమరాడలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పోలి నాయుడు, బిబి మధుసూదన్‌రావు, వెంకటనాయుడు, సింహాచలం, ఆదిబాబు, సాయిరాం, హక్కుల నాయుడు, స్వామినాయుడు ఉన్నారు. బలిజిపేట: ఉక్కు రక్షణ బైక్‌ యాత్ర జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యమ్మల మన్మధరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక పిఎస్‌ఎన్‌ జూనియర్‌ కాలేజీలో విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నారు. కావున సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు రక్షణ యాత్ర అనే పేరుతో జరుగుతున్న బైక్‌ ర్యాలీకి విద్యార్థులంతా మద్దతు ఇవ్వాలన్నారు. ఈనెల 24న పార్వతీపురంలో జరుగు బైక్‌ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు మద్దతు ప్రకటించారు. సీతంపేట: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణపై ఉక్కు రక్షణ యాత్ర ఈ నెల 20వ తేదీ నుండి 29 వరకు జరుగుతున్న సందర్భంగా గురువారం ఐటిడిఎలో సిపిఎం నాయకులు జీలకర్ర శ్రీరాములు, సాయికుమార్‌ తదితరులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకోవాలని ప్రజలకు ఉద్యోగులకు అవగాహన కల్పించారు.