ప్రజాశక్తి - టి.నరసాపురం
మండలంలోని కృష్ణాపురంలో ఎంపిపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన గణేష్‌ను భుక్యా గోపయ్య సక్రమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం టి.నరసాపురంలో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయున్ని పూలమాలలు, శాలువాతో సత్కరించారు. అదేవిధంగా భూక్యా శ్రీనివాస్, జరబాల బాలాజీ దాతల సహకారంతో ఫౌండేషన్ వ్యవస్థాపకులు భూక్యా వేణుగోపాల్ ఆధ్వర్యంలో 130 మంది విద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు. విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేశావత్ వెంకట్, భుక్యా సత్తిబాబు, భుక్యా కృష్ణ పాల్గొన్నారు.










