ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
ఇటీవల రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన రావికంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు గడ్డ నాగేశ్వరరావును సోమవారం జంగారెడ్డిగూడెం బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వీరితో పాటు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన బుట్టాయగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జువాలజీ సబ్జెక్టు పిజిటి గుర్రం గంగాథరరావు, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వేగవరం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు తలారి అమృతరావులను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. సోమవారం బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి కనపర్తి రాజా అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖండవల్లి గిరిబాబు, భూపతి రామారావులు మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా అమూల్యమైన సేవలందిస్తూ, అవార్డులు సాధించి, ఈ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన ఉపాధ్యాయులను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కట్టా శ్రీనివాసరావు, జిల్లా మహిళా కార్యదర్శి కెఎస్‌వి లోవా కుమారి, మండల కోశాధికారి కలపర్తి శ్రీనివాసరావు, జిల్లా ప్రచార కార్యదర్శి కాటంరాజు, కామవరపుకోట మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కస్సే శ్రీనివాసరావు, రఘునాధ్ పాల్గొన్నారు.










