ప్రజాశక్తి-ఆదోని
ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన ఉవారిని యుటిఎఫ్ ఆధ్వర్యంలో సన్మానించారు. సోమవారం పట్టణంలోని నేషనల్ హైస్కూల్ సమావేశపు భవనంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి టి.గాదిలింగప్ప అధ్యక్షతన జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన జంబులింగయ్య, సలావుద్దీన్, శకుంతల, సావిత్రి, ఆదిమూర్తి, పదోన్నతుల్లో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన జిసి.షేకన్న, రవికుమార్‌ను శాలువా, పూలమాలతో సన్మానించారు. యుటిఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షులు జీవిత మాట్లాడుతూ... ఉపాధ్యాయులు బోధనలో మెళకువలు నేర్చుకుంటూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. యుటిఎఫ్ సీనియర్ నాయకులు పాపయ్య, రుద్రముని, శ్రీనివాసులు, నారాయణ, నర్సయ్య గౌడ్, ఆవుల బసప్ప, ఎల్‌కె.బసప్ప, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఉపాధ్యాయులను సన్మానిస్తున్న నాయకులు










