Aug 15,2023 23:52

ప్రజాశక్తి-యంత్రాంగం
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు పలువురు అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం అవార్డులను మంత్రి జోగి రమేష్‌, జిల్లాకలెక్టర్‌ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా అందజేశారు.
మండపేట: మండపేట మండల తహశీల్దార్‌ టిఆర్‌. రాజేశ్వరరావు ఉత్తమ సేవా అవార్డును మంగళవారం అందుకున్నారు. అలాగే రెవెన్యూ శాఖ ఎంఎస్‌ఒ సుబ్బారాజు ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. అవార్డు గ్రహీతకు రెవిన్యూ శాఖ ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఆత్రేయపురం: అత్యుత్తమ ఎంపిడిఒగా నాతీ బుజ్జి మంగళవారం ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. రామచంద్రపురం: కె.గంగవరం తహశీల్డారు వైద్యనాథ్‌శర్మ ఉత్తమ సేవలకు అవార్డు అందుకున్నారు. అదేవిధంగా రామచంద్రపురం ఎస్‌ఐ డి.సురేష్‌ బాబు, ఏరియా ఆసుపత్రి జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రసాద్‌, జిల్లా సైన్స్‌ అధికారి గిరిజాల సుబ్రహ్మణ్యం. డిపిఆర్‌ఒ ఆలీ, ద్రాక్షారామ కోర్టు కానిస్టేబుల్‌ జానకిరామయ్య ఉత్తమ సేవలకు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. కపిలేశ్వరపురం: ఉత్తమ సేవా ప్రతిభా అవార్డులను ఎంపిడిఒ ఎం.రామకష్ణారెడ్డి, మండల వ్యవసాయ అధికారి కెవిఎన్‌ రమేష్‌ కుమార్‌, విఆర్‌ఒ ఎ. మల్లేష్‌లు అందుకున్నారు. అమలాపురం: అమలాపురం ఎండి.ఆలీ డివిజన్‌ పిఆర్‌ఒ జి.రాజు, ఫొటోగ్రాఫర్‌ లు ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డిఐపిఆర్‌ఒ కార్యాలయం సిబ్బంది అవార్డు గ్రహీతలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అంబాజీపేట: పి.గన్నవరం సర్కిల్‌ అంబాజీపే సిఐ కార్యాలయంలో కానిస్టేబుల్‌ విధులు నిర్వహిస్తున్న డి.నరేష్‌ ఉత్తమ సేవ పురస్కారాన్ని అందుకున్నారు.