గోరంట్ల: మండలంలో సుపరిపాలన అందించిన గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచులకు గ్రామ కార్యదర్శులకు ఎంపీపీ ప్రమీల మూర్తి ఎంపీడీవో రఘునాథ్ గుప్తా ప్రశంస పత్రాలను మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అందజేశారు, ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని సర్పంచులు కార్యదర్శులు ఘనంగా నిర్వహించారు పాలసముద్రం, వానవోలు, మల సముద్రం, నర్సంపల్లి, గోరంట్ల, మందలపల్లి, మల్లాపల్లి గ్రామపంచాయతీలో తాగునీరు పరిసరాలు పరిశుభ్రత మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం వంటి విషయాలలో సుపరిపాలన జరిగిందని సర్వేలో వెల్లడైందన్నారు. దీంతో ఆయా గ్రామపంచాయతీలకు జిల్లా ఉన్నతాధికారి నుండి ప్రశంస పత్రాలు వచ్చాయనిఎంపీడీవో రఘునాథ్ గుప్తా తెలిపారు రాబోవు రోజుల్లో కూడా గ్రామాల్లో సుపరిపాలన అందించడానికి సర్పంచులు కార్యదర్శిలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జయరామ్ నాయక్, జిల్లా కోఆప్షన్ మెంబర్ బాషా, ఇన్‌ఛార్జి ఇఒఆర్‌డి సతీష్, సర్పంచులు గంగప్ప, సరోజ నాగే నాయక్, శివానంద, రామాంజనేయులు, నర్సిరెడ్డి, కార్యదర్శులు నాగరాజు, సోమశేఖర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి రూరల్: మండలం వ్యాప్తంగా పంచాయతీ కేంద్రాల్లో పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలను సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించుకున్నారు. పెడపల్లి గ్రామపంచాయతీ లోగల సచివాలయంలో సర్పంచి మంగ్లీ బారు ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలు నిర్వహించి గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ పంచాయతీని అభివద్ధి పరచుకునేందుకు కొన్ని మార్గాలను సూచిస్తూ సచివాలయ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రజలందరికీ త్వరితగతిన సేవలను అందించడం వలన మేలు కలుగుతుందని అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ అభివృద్ధి కొరకు ప్రణాళికను తయారుచేసి వాటిని తప్పకుండా అమలు చేస్తామని వాటి ద్వారా మన పంచాయతీ అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచి సీనప్ప ఎస్టీ సెల్ తిరుపాల్ నాయక్ , శ్రీనివాస నాయక్, బండ్ల మోహన , కార్యదర్శులు తేజశ్రీ, నరేష్, ఎంపిటిసి సరస్వతి బారు, సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.
లేపాక్షి : మండల కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయం, లేపాక్షి పంచాయతీ కార్యాలయం లో పంచాయతీ రాజ్ శాఖ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆదినారాయణ, నాగేంద్ర, వసుంధర కార్యదర్శులు నాగేంద్ర, ఆనంద్ కుమార్, లక్ష్మయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు
గాండ్లపెంట : మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. సుపరిపాలన అందించిన పంచాయతీలకు ప్రశంసాపత్రాలను ఎంపీపీ తాతం జగన్మోహన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఒఆర్‌డి సునీత, సీనియర్ సహాయకులు ఎన్. అమీర్‌బాషా, పంచాయతీ కార్యదర్శులు బాషా, ఓబులమ్మ. సర్పంచులు రహంతుల్లా రవీంద్ర నాయక్ సర్పంచులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరిగి : మండల వ్యాప్తంగా ఉన్న 14 పంచాయతీల్లో తొమ్మిది పంచాయతీలు అభివృద్ధిలో ముందడుగు వేస్తూ జిల్లా స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని ఎంపీడీవో సరస్వతి అన్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవంలో భాగంగా ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది ప్రణాళికలతో సుపరిపాలన అందించిన గ్రామ పంచాయతీలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇఒఆర్‌డి చంద్రశేఖర్, ఎంఇఒ లక్ష్మీదేవి, వ్యవసాయ అధికారిణి విజయభారతి, హౌసింగ్ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : మండల పరిధిలోని చందకచర్ల పంచాయతీ సుపరిపాలన అందించిన దానికి గుర్తింపుగా ప్రభుత్వం అవార్డు అందజేసింది. సర్పంచి ప్రభావతి దేవల నాయక్ ఆధ్వర్యంలో పంచాయతీని అభివృద్ధి చేసినందుకు .సోమవారం స్థానికఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సోనీ బారు,ఎంపీపీ కవితా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఓబుల దేవర చెరువు : గ్రామాల అభివృద్ధిలో పంచాయతీరాజ్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని సుపరిపాలన కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థ పనిచేస్తోందని ఎంపీడీవో పోలప్ప పేర్కొన్నారు స్థానికమండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పర్వీన్ భాను, ట్రాన్స్‌కో ఎఇ రామసూరారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ జెఇ దీపక్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ నాగిరెడ్డిగారిజయమ్మ, ఏపీవో సోమశేఖర్, ఎపిఎం రమణప్ప, సర్పంచులు గోవిందు, రేణుక భారు, పంచాయతీకార్యదర్శులు, ఉపాధిహామీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : మండల పరిధిలోని అప్పరాచెరువు ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడంతో సోమవారం పుట్టపర్తిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో సర్పంచి శారదమ్మ, కార్యదర్శి అలివేలుమంగమ్మలకు కలెక్టర్ విజరుబాబు అవార్డు, ప్రశంసా పత్రం అందజేశారు. 'దారిద్య్ర నిర్మూలన జీవనోసాధి' అంశంలో అప్పరాచెరువు పంచాయతీకి అవార్డు లభించింది.
నంబులపూలకుంట
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఎంపీపీ ఈటె రాము అధ్యక్షతన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళలు అర్పించారు. అనంతరం ఎంపిపి మాట్లాడుతూ పంచాయతీల్లోని సర్పంచిలు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి గ్రామాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పాలన సాగిస్తున్నారన్నారు. అనంతరం పలువురు సర్పంచిలకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆదినారాయణ, ఈఓఆర్డీ మనోహర్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచిలు, ఉపసర్పంచిలు పాల్గొన్నారు.
కొత్తచెరువు: పంచాయతీల అభివద్ధికి సర్పంచిలు, కార్యదర్శులు కషి చేయాలని ఎంపీపీ గాయత్రి రెడ్డప్ప రెడ్డి, ఎంపీడీవో సిద్ధారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం గురించి తెలుసుకొని వాటికి అనువుగా గ్రామాల్లో పాలన నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే నిధులను పంచాయతీల్లో పారిశుద్ధ్యం, అభివద్ధి పనులకు ఉపయోగించాలన్నారు. ముఖ్యంగా వీధిలైట్లు, తాగునీరు, డ్రైనేజీ, తదితర మౌలిక సౌకర్యాలపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ఉపాధి హామీ పనులను గ్రామాల్లోని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం ఉత్తమ పంచాయతీలుగా ఎన్నికైన కొడపగానిపల్లి, తిరుమల దేవరపల్లి, నాగిరెడ్డిపల్లి పంచాయతీలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో నాగిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ఓబులేసు, కార్యదర్శులు గంగాధర్ రెడ్డి, సాయినాథ్, సూపర్‌వైజర్ పుష్పలత, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు,
బత్తలపల్లి :స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సోమవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి గజ్జల వెంగళరెడ్డి మాట్లాడుతూ మండలంలో ప్రతి పంచాయతీ ఆదర్శ పంచాయతీగా అభివద్ధి చెందాలన్నారు. సర్పంచిలు, కార్యదర్శులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం
ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన అప్పరాచెరువు, సంగాల, మాల్యవంతం, దంపెట్ల, బత్తలపల్లి, ఓబుళాపురం, సంజీవపురం, తంబాపురం, పోట్లమర్రి, ఈదుల ముత్తూరు, గరిశనపల్లి, నల్లబోయనపల్లి, డి. చెర్లోపల్లి, పంచాయతీలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ యుగేశ్వరీదేవి, ఎంపిడిఓ శ్రీదేవి, కార్యదర్శులు, సర్పంచిలు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
బుక్కపట్నం: బుక్కపట్నం గ్రామ పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎన్నికైనందున సోమవారం సర్పంచ్ నాగలక్ష్మి రాజుకు ప్రశంసా పత్రం అందజేశారు. పంచాయతీ పరిధిలో స్వయం సమద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి సమద్ధి కలిగిన పంచాయతీ విభాగంలోనూ, సుపరిపాలన కలిగిన పంచాయతీ వంటి అంశాల్లో మండల స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎన్నిక కావడంతో ఈ పురస్కారాలకు అర్హత పొందింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తాము చేసిన సేవలకు గుర్తింపుగా పురస్కారాలు రావడం ఆనందదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి ఎంపీడీవో శ్రీనివాసులు, జడ్పిటిసి శ్రీలత గోవర్ధన్ రెడ్డి, ఈవోఆర్‌డి ఇందిరాబాల, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు..










