Aug 16,2023 19:51

విజయవాడలో అవార్డు అందుకుంటున్న ఎఎన్‌ఎం విజయలక్ష్మి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అవార్డులు అందజేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ సృజన, ఎస్పీ కృష్ణ కాంత్‌, జెసి నారపురెడ్డి మౌర్య చేతులమీదుగా అవార్డులు అందించారు. ఉత్తమ సబ్‌ కలెక్టర్‌గా అభిషేక్‌ కుమార్‌, ఉత్తమ తహశీల్దార్‌గా వెంకటలక్ష్మి, ఉత్తమ విఆర్‌ఒలుగా కుప్పగల్‌ విఆర్‌ఒ వామన్‌ రావు, పెద్దతుంబలం విఆర్‌ఒ చిన్న ఈరన్న, అమరావతి నగర్‌ విఆర్‌ఒ రాజశేఖర్‌ గౌడ్‌, డిఎల్‌పిఒ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ తేజ, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ దంపతులు చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. అలాగే పెద్దహరివాణం బీసీ హాస్టల్‌ వార్డెన్‌ శివుడు, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి పి.వెంకటలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పెద్దహరివాణం పిహెచ్‌సి పరిధిలో విధులు నిర్వహిస్తున్న సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి ఉత్తమ సూపర్‌వైజర్‌ అవార్డు అందుకున్నారు. ఇస్వి ఎఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి విజయవాడలో జిఎస్‌డబ్ల్యుఎస్‌ డాక్టర్‌ జి.లక్ష్మయ్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డులు అందుకున్న అధికారులు బుధవారం అభినందించారు.