Oct 26,2023 21:20

మార్కెట్లో ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఉల్లిపాయలు

ఉట్టెక్కిన ఉ(లొ)ల్లి
బహిరంగ మార్కెట్లో కిలో రూ.50
దీపావళికి మరింత పైపైకి...
ప్రజాశక్తి - బాలాయపల్లి
టమోటా ధర కిలో 200 వరకూ వెళ్లి రెండు నెలలు బహిరంగ మార్కెట్‌ల్లో రాజ్యమేలింది.. ప్రస్తుతం కిలో 10-15 మధ్య ధర పలుకుతూ పతన దిశలో ఉంది. వెనువెంటనే మార్కెట్లో ఉల్లి ధర పెరగనుందని పెద్దఎత్తున ప్రచారం ఆగస్టులోనే మొదలయ్యింది.. దీంతో వ్యాపారులు పెద్దఎత్తున గోదాముల్లో ఉల్లి నిల్వ పెట్టారు. అయితే ధర పెరగకపోవడంతో వ్యాపారులు గోదాముల్లో నిల్వలను బయటకు తీశారు. ప్రస్తుతం అక్టోబర్‌ నెలాఖరులో ఉల్లి ఉట్టెక్కింది. మార్కెట్లో కిలో రూ.45-50 ధర పలుకుతోంది. దీపావళి నాటికి ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తూ మళ్లీ గోదాముల్లోకి ఉల్లిని మళ్లించే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్‌ ఉన్న మహారాష్ట్రతో పాటు, కర్నాటకలోనూ ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో కొరత ఏర్పడింది. ఈ కారణంగా ధరలు పెరుగుతున్నాయని సమాచారం.
మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠస్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షా భావం వల్ల దిగుబడి తగ్గింది. వర్షాకాలంలో కర్ణాట కలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుం టారు. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావ డంతో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు. కొన్ని చోట్లు ఉల్లిసాగు చేసినా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేల హెక్టార్లలో నేలకొరి గిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వినియోగం అధికం
దేశీయంగా ప్రతి నెలా సగటున 13లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పండుతుంది. 65శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్‌-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబ రు-నవంబరు వరకు ఉంటుంది. అయితే, నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40శాతం కోల్పోతాయి. కుళ్ళిపోవడంవల్ల కొన్ని వథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా. దీపావళి పండగ సీజన్‌ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలున్నాయి. ఈ పరిణామాలను దష్టిలో ఉంచుకొని ధరల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఉల్లి ఎగుమ తులపై విధించే పన్నును ఆగస్టులో 40శాతం మేర పెంచింది. ఈ పన్ను ఏడాది చివరివరకు అమల వుతుంది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభు త్వ యోచన.
మార్కెట్లో ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఉల్లిపాయలు