matladutunna akhil
ప్రజాశక్తి- గన్నవరం (ఉంగుటూరు)
ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కళాశాల హీరో అక్కినేని అఖిల్ ఆదివారం సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకున్న హీరో ఆఖిల్ కు నిర్మాత, కళాశాల ఛైర్మన్ సుంకర రాంబ్రహ్మం, డైరక్టర్,ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. నూతనంగా నిర్మిస్తున్న ఏజెంట్ చిత్రం ఈనెల 28న విడుదల కాబోతున్న సందర్భంగా సినిమా ప్రచారంలో భాగంగా హీరో అఖిల్, నిర్మాత సుంకర రాంబ్రహ్మం ఉషారామా ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి కాసేపు సరదగా మచ్చడించారు. కార్యక్రమం అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్లారు.










