వినతిపత్రం ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్నకు వినతిపత్రం అందజేసి కోరినట్లు నాయకులు నాగరాజు, వీరచంద్ర యాదవ్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్‌టియు ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం జరిగింది. ఉమ్మడి సర్వీస్ రూల్స్ విడుదల, పదోన్నతులు, బదిలీలు, ఎంఇఒ, డిప్యూటీ డిఇఒ, డిడిఒ పవర్స్, పెండింగ్ నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరుకు కృషి చేయాలని కోరామన్నారు. విద్యా శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని తిమ్మన్న తెలిపారన్నారు. జిల్లా అధ్యక్షులు గోకారి, నాయకులు రామ్మోహన్ రెడ్డి, షఫీ, దేవదాసు, ముదూసిర్, నాగరాజు, జాన్, శ్రీనివాసులు ఉన్నారు.










