Sep 20,2023 22:11

మృతి చెందిన లక్ష్ముమయ్య

పాలకొండ : స్థానిక ఇందిరానగర్‌ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సారవకోట మండ లానికి చెందిన అన్నుపురం లక్ష్ముమ య్య (58) అనుమాదస్ఫదంగా మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే లక్ష్ముమయ్య సీతంపేట మండలం బుడగరాయి లోని పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లక్ష్ముమయ్య భార్య నాలుగేళ్ల క్రితం సీతంపేటలో అనుమానస్పదంగా మృతి చెందింది. ఈ రోజు ఉపాధ్యాయుడు నివాసం ఉంటున్న ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని పోలీసులకు ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందినట్లు తెల్పారు. ఉపాధ్యాయుడి మృతి పట్ల పోలీసులు అనుమానస్పద కేసు నమోదు చేసి మృతదేహంను పాలకొండ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ మురళీధర్‌, ఎస్‌ఐ శివ ప్రసాద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.