Apr 21,2023 21:45

ఈశ్వర్‌ రెడ్డి ని సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

ప్రజాశక్తి - చిలమత్తూరు : 20 సంవత్సరాలుగా హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యనందించిన ఈశ్వర్‌ రెడ్డికి 1998 డీఎస్సీ ఉపాధ్యాయుడిగా కొలువు వచ్చింది. ఇందులో భాగంగా చిలమత్తూరు మండలం టేకులోడు మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో గతంలో సప్తగిరి కళాశాలలో చదివిన విద్యార్థులు శుక్రవారం ఈశ్వర్‌ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమం లో ప్రదానోపాధ్యాయుడు సాదీక్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రజాశక్తి విలేకరి గంగరాజు, డిజిటల్‌ అసిస్టెంట్‌ మహేష్‌, గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్యుస్టూట్‌ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.