ప్రజాశక్తి-ఘంటసాల : ఉపాధిహామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే ఎవరిని ఉపేక్షించబోమని ప్రీసైడింగ్ అధికారి నాంచారావు హెచ్చరించారు. 17వ సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎన్‌ఆర్జీఎస్ కార్యాలయం వద్ద శనివారం జరిగింది. 2022 ఏప్రియల్ నుంచి 2023 మార్చి 31 వరకు మండలంలో 8 కోట్ల 86 లక్షల 74 వేల 253 పని దినాలకు సంబంధించి తనిఖీ రిపోర్లను సీఆర్పీలు సామాజిక తనిఖీ ప్రజావేదిక ముందు సమర్పించారు. ఉపాధి హామీ పథకం పనుల్లో మస్తర్ల వెరిఫికేషన్లో లోపాలు, గహనిర్మాణ పథకానికి సంబంధించి పని ఎక్కువగా చూపించటం, ఇతర అంశాల్లో జరిగిన అవకతవకలపై సీఆర్పీలు తమ రిపోర్టులను చదివి వినిపించారు. దీనిపై అధికారులు 2 లక్షల వరకు రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఏపీడీ రమణరావు, జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీలత, అంబుడ్యూస్ మెన్ శ్రీనివాసరావు, ఎంపీడీవో కె.వి.సుబ్బారావు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










