Apr 06,2023 22:37

mpp gogam suresh

ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి
పెదపారుపూడి ఎంపిపి గోగం సురేష్‌
ప్రజాశక్తి-పెదపారుపూడి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌జిఎస్‌) ద్వారా చేపడుతున్న పనుల్లో కూలీలు పెద్దఎత్తున పాల్గొనటం ద్వారా జీవనోపాధి పొందాలని పెదపారుపూడి ఎంపీపీ గోగం సురేష్‌ కోరారు. పెదపారుపూడిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయన ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పెదపారుపూడి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయని చెప్పారు. అధికార యంత్రాంగం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఖచ్చితమైన కొలతలతో నిబంధనల మేరకు పనులు చేయించాలని అధికారులను కోరారు. రానున్న ఖరీఫ్‌ సీజన్లో వ్యవసాయంలో పంటల సాగుకు నీరు సక్రమంగా అందించేలా కాలవలు తవ్వి పనులు చేపట్టాలన్నారు. వేసవిలో ఉపాధి కూలీలు ఎండ నుంచి ఉపశమనం కలిగించేందుకు టెంట్లు ఏర్పాటు చేయటం, త్రాగునీరు, మజ్జిగ వంటివి అందజేసే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.