May 25,2023 22:38

అధికారులతో మాట్లాడుతున్న పీడీ

ప్రజాశక్తి - గాండ్లపెంట : మండలంలోని జరుగుతున్న ఉపాధి హామీ పనులను ద్వామా పీడీ రామాంజనేయులు గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన అమృత్‌ సరోవర్‌ కింద చేపట్టిన చెరువులో పూడికతీత పనులు పరిశీలించారు. మట్టిని చెరువు కట్టలపై వేస్తే కట్ట నాణ్యతగా ఉంటుందని అన్నారు. అలాగే మట్టిని రైతులు పొలాలకు తరలించుకుంటే పొలాలకు అనువుగా ఉంటుందన్నారు. కూలీలకు రోజువారిగా కనీస వేతనం రూ.272 వచ్చేలా చూడాలని ఉపాధి సిబ్బందికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రెహానాబేగం, ఎంపీడీవో డి. అంజనప్ప, ఏపీవో మంజునాథ్‌, ఈసీ సుబ్బారెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.