Sep 18,2023 14:54

ప్రజాశక్తి-ఏలూరు జిల్లా : ఏలూరు రైల్వే స్టేషన్ ఈస్ట్ బుకింగ్ కౌంటర్ సమీపంలో గుర్తు తెలియని (సుమారు 30-35 సం.ల వయస్సు) పురుషుడు మృతి చెంది ఉన్నాడు. మృతుడు అనారోగ్యకారణాల వలన గాని మరి ఏ ఇతర కారణాల వలన గాని మృతి చెంది ఉండవచ్చు అని కేసు దర్యాప్తు అధికారి అయిన ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నంబూరి ఆదినారాయణ తెలియపరిచారు. మృతుడు 5.6 ఎత్తు, కోలముఖం, నలుపు ఛాయ, నల్లని జుట్టు, నల్లని గెడ్డం కలిగి ఉన్నాడు. మృతుడు సిమెంట్, పసుపు రంగు గళ్ళతో కూడిన తెలుపు రంగు పొడవు చేతుల చొక్క, సిమెంట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతదేహంను ఏలూరు GGH మార్చురీ రూంలో భద్రపరచటమైనది. మృతుని వివరాలు తెలిసిన వారు ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ N.ఆదినారాయణ  8074055378కి తెలియపరచగలరు.