ప్రజాశక్తి-ఏలూరు: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడు - జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామాల మధ్య వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందారు. రావికంపాడు దేవులపల్లి గ్రామాల మధ్య నిర్వహిస్తున్న దాబా హోటల్ యజమాని మధు(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం రాత్రి నుంచి కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలిస్తున్నారు. అయితే మంగళవారం ఉదయం దాబా హోటల్ సమీపంలోని ముళ్ల పొదల్లో మృతదేహంను స్థానికులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తడికలపూడి పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.










