వంతెనపై నుంచిప్రవహిస్తున్న చిట్టిగెడ్డ
మక్కువ: మండలంలో మంగళవారం సాయంత్రం ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు చిట్టిగెడ్డ ఉధృతంగా ప్రవహించింది. దీంతో మార్కొండి పుట్టి నుంచి నంద వైపు వెళ్లే సుమారు 15న గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గెడ్డపై మార్కొండపుట్టి సమీపాన చిన్నపాటి వంతెన నిర్మించగా, శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఏమాత్రం గెడ్డ ఉధతి వచ్చినా ఈ వంతెనపై ప్రవాహం రావడంతో గిరిజనుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాక్ష్యాత్తు డిప్యూటీ సీఎం రాజన్నదొర సొంత పంచాయతీకి ఆనుకొని ఉన్న చిన్నపాటి వంతెన కూడా కనీసం పట్టించుకోకపోవడంతో గిరిజనుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు దష్టి సారించి నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.










