Sep 15,2023 21:26

కలెక్టర్‌కు సమస్యలను వివరిస్తున్న ఉద్యోగులు

పార్వతీపురం: ఉద్యోగుల స్పందనకు వచ్చే వినతులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ఉద్యోగుల గ్రీవెన్స్‌ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఉద్యోగులు వివిధ అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, పదోన్నతులపై, తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు. ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 12 దరఖాస్తులు అందాయని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.