May 21,2023 22:55

శ్రీనివాసరావుతో ఎన్‌ఎంయు నాయకులు

ప్రజాశక్తి-కదిరి టౌన్‌ :ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస రావు తెలిపారు. ప్రభుత్వంలోకి విలీనమైన తర్వాత ఆర్టీసీ ఉద్యో గులకు ఉత్పన్నమైన సమస్యల పట్ల రాజీ లేని పోరాటం చేస్తున్నది ఎన్‌ఎంయు మాత్రమే అన్నారు. ప్రభుత్వంలోకి విలీనమైన తర్వాత ఉద్యోగులకు దక్కాల్సిన ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌ స్కీం ఇంక్రి మెంట్లు, పదోన్నతులు, కారుణ్య నియామకాలు, పనిష్మెంట్లలో మార్పులు ఇప్పించి క్యాడర్‌ స్ట్రెంత్‌లో డిపోల్లో ఎక్కువ కాబడిన ఉద్యోగుల్లో భయాం దోళనలు నివారించి అక్కడే పనిచేసేలా ఉత్తర్వులు ఇప్పించిన ఘనత ఎన్‌ఎం యుదే అన్నారు. కొన్నేళ్ల పాటు తాత్కాలిక పదోన్నతిపై పని చేస్తున్న వారిని రెగ్యులర్‌ చేయించామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఉద్యోగులకు ఇబ్బందిగా కలగకుండా ఉత్తర్వులు ఇచ్చేందుకు, సర్వీస్‌ కండిషన్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. త్వరలో ఉద్యోగులందరికీ ఆర్జిత సెలవుల సొమ్ము అకౌంట్లో జమ అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు పివి రమణారెడ్డి, ఉపాధ్యక్షులు హరిమోహన్‌, ఎన్‌.వెంకటరమణ, రీజినల్‌ కార్యదర్శి షబ్బీర్‌, బాబు, మద్దిలేటి, కదిరి డిపో సెక్రటరీ బైరిశెట్టి, హిందూపురం సెక్రటరీ రంగనాథప్ప, తదితరులు పాల్గొన్నారు.