పార్వతీపురం రూరల్: స్థానిక ఎన్‌ఇజిఒ హోమ్‌లో ఉపాధ్యాయుడు బోనెల సత్యకుమార్ సంజీవి సంకలన పర్చిన ఉద్యోగ కరదీపిక పుస్తకాన్ని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు, హెచ్‌ఒడిలకు, డిడిఒలకు పెన్షనర్లకు కరదీపిక తెలుగులో అనువదించడం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఉపాధ్యాయుని ప్రయత్నాన్ని అభినందించారు. త్వరలో పెన్షనర్ దీపిక అనే పుస్తకాన్ని కూడా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సమాచారం నిమిత్తము ప్రచురణ చేస్తున్నానని, భవిష్యత్తులో రాబోయే జీవోలను కూడా పొందుపరిచి ఎప్పటికప్పుడు రివైజ్డ్ ఎడిషన్ లను కూడా తయారు చేస్తానని సంకలనకర్త తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎన్‌జిఒ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు జి.వి.ఆర్.ఎస్. కిషోర్, కొమరాడ ఎంఇఒ జే. నారాయణస్వామి, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ పార్వతిపురం ఎటిఒ మన్మధ రావు, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ కే. జగన్నాధ రావు పాల్గొన్నారు.










