ఉదయగిరిలో గెలుపు తథ్యం
ప్రజాశకి-ఉదయగిరి : ముఖ్యమంత్రిపై చూపిస్తున్న ఆదరణతో ఉదయగిరిలో గెలుపు తథ్యమని నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గండిపాలెం గ్రామంలో రెండోవ రోజు బుధవారం మండల ఉపాధ్యక్షులు గుండుపల్లి మాలకొండయ్య చౌదరి ఏర్పాటు చేసిన గడపగడప పర్యటనలో వాడవాడలా మంగళ హారతులు, పూల స్వాగతాలు, బాణసంచాలు తప్పెట్లతో గడపగడపలో అపూర్వ ఆదరణ లభించిందన్నారు. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నూతన పెన్షన్ మంజూరైన వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళకు నగదు అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మాజీ ఎంపిటిసి పాముల రమణయ్య గ్రామ సమస్యలపై తమ దృష్టికి తీసుకువచ్చారని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఏ టైం అయినా మీ వెంటే ఉండి సమస్యలను పరిష్కరిస్తాన న్నారు. గుండుపల్లి మాలకొండయ్య తెలుసుగానీ ఇంత ప్రజల ఆదరణ ఉన్న వ్యక్తిగా ఇప్పుడే చూస్తున్నానన్నారు. గండిపాలెంలో ఆదరణ తనకు కూడా అందించాలని 2024లో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం జగనన్న ఇళ్లు మంజూరుకు లేఅవుట్ శాంక్షన్‌కు శుభ్రం చేసిన లేఅవుట్‌ను పరిశీలించి వెంటనే సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్‌కు ఆదేశించారు. అలాగే శిథిలావస్థలో చేరిన పాఠశాలను పరిశీలించి నూతన గదుల మంజూరుకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే గండిపాలెం జలాశమును పరిశీలించి సమస్యలను డిఇఇ చంద్రమౌళిని అడిగి తెలుసుకున్నారు.తహశీల్దార్ సానా శ్రీనివాసులు రెడ్డి, ఎంపిడిఒ ఈశ్వరమ్మ, డిఇఇ చంద్రమౌళి, మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు వినరు రెడ్డి, ఎంపిటిసి తిరుపతయ్య, సర్పంచులు గొల్లపల్లి కల్పన, కల్లూరి వెంకటేశ్వర రెడ్డి కొల్లుబోయిన కృష్ణ, ఎం.తిరుపతి సాహిత్య డైరెక్టర్ అక్కి భాస్కర్ రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ కృష్ణారెడ్డి, భాషా, రియాజ్, గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.










