Aug 06,2023 20:27

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
2024 ఎన్నికల్లో టిడిపికి ఓటమి తప్పదని భావించి టిడిపి నాయకులు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పుంగనూరులో హింసకాండకు దారులు వేశారని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల యాత్ర అంటూ రాష్ట్రంలో పర్యటిస్తున్న చంద్రబాబు అనంత రౌడీలతో పథకం ప్రకారం పర్యటనను రోడ్డు మ్యాప్‌ ద్వారా వెళ్లకుండా అక్కడ గొడవలకు దారులు వేశారని తెలిపారు. టిడిపి హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మించని చంద్రబాబు ఎన్నికల ముందు కమీషన్ల కోసం శిలాఫలకాలు వేశారని విమర్శించారు. రాజన్న జలయజ్ఞంతో రాష్ట్రం సస్యశ్యామలమైందన్నారు. రాష్ట్రం శాంతియుతంగా ఉండడం ఆయనకు ఇష్టం లేదని, చంద్రబాబు పర్యటన అంటే ప్రజలే భయపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇకనైనా వెన్నుపోటు రాజకీయాలు మానుకొని శాంతియుత రాష్ట్రాన్ని ప్రజలకు అందించడానికి ముందుకు రావాలని హితవు పలికారు. వైసిపి మండల అధ్యక్షులు బిఆర్‌.బసిరెడ్డి, సోగనూరు భీమిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ నజీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.