May 26,2023 20:07

ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్న ప్రేమ్స్‌ ప్రొప్రైటర్‌ వేణుగోపాల్‌.

ఉచితంగా మజ్జిగ పంపిణీ
ప్రజాశక్తి - నంద్యాల రూరల్‌

       నంద్యాల పట్టణంలోని ఆంధ్ర ఫ్రేమ్స్‌ ప్రొప్రైటర్‌ వేణుగోపాల్‌ గత 30 రోజులుగా రోజుకు 100 లీటర్ల మజ్జిగ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వేణుగోపాల్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక సాయిబాబా గుడి దేవస్థానం వద్ద గత 30 రోజులుగా మజ్జిగ, మంచినీరు ఉచితంగా అందిస్తున్న వేణుగోపాలను నీడ్‌ ఫర్‌ హెల్ప్‌ సభ్యులు వసుమతి, శాంతకుమారి, భాగ్యలక్ష్మి, జానకిలు శాలువా కప్పి మొమెంటో అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నీడ్‌ ఫర్‌ హెల్ప్‌ సభ్యురాలు వసుమతి మాట్లాడుతూ బొల్లవరంకు చెందిన గోపాల్‌ గత 30 రోజుల నుంచి మజ్జిగ, తాగునీరు అందించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇటువంటి మంచి పని చేసే వారిని ప్రతి ఒక్కరూ అభినందించాలని కోరారు. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు వేణుగోపాల్‌కు ఉండాలని కోరారు. ఆంధ్ర ఫ్రేమ్స్‌ ప్రొప్రైటర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో రోజుకు 100 లీటర్ల మజ్జిగ, చల్లటి నీరు గత 30 రోజులుగా అందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో కూడా అందరి సహకారం ఉంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీడ్‌ ఫర్‌ హెల్ప్‌ సభ్యులు, సత్య తేజ, మధు, వెంకటసుబ్బయ్య, సుధాకర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.