ఆపరేషన్ చేయించుకున్న వారికి సూచనలు చేస్తున్న నిర్వాహకులు
ప్రజాశక్తి - ఆదోని
అవోపా ఆధ్వర్యంలో ఆదోనిలో 23న నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో ఎంపికైన 125 మంది రోగులకు నంద్యాలలోని శాంతిరామ్ ఆస్పత్రిలో నిర్వహించిన ఆపరేషన్లు విజయంతమైనట్లు అవోపా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనాథ్ గుప్తా, మిర్యాల శ్రీధర్, దాత నరేష్ కాకుబాళ్ తెలిపారు. శనివారం ఆదోనికి తిరిగి వచ్చిన రోగులను కలిసి వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పేదల కళ్లల్లో వెలుగు నింపడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. మహిళా విభాగ్ అధ్యక్ష, కార్యదర్శులు బూదూరు సంగీత, మమతశ్రీ, కోశాధికారి ప్రతాప్, హిమబిందు, సభ్యులు వంకదారు గీత, లావణ్య ఉన్నారు.










