ప్రజాశక్తి - ఆదోని
ఆర్య వైశ్య ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ సౌజన్యంతో సెప్టెంబర్ 3న ఆదోనిలోని శక్తి గుడి వద్ద శ్రీజిహ్వేశ్వర పాఠశాలలో ఉచిత గుండె, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి ఆపరేషన్లు చేస్తున్నట్లు సంఘం మాజీ అధ్యక్షులు నగేష్ కాకుబాళ్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వంకదారు శ్రీనాథ్ గుప్త, మిరియాల శ్రీధర్ తెలిపారు. బుధవారం ఆదోనిలోని కార్యాలయంలో కరప్రతాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుండెకు సంబంధించిన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్, టిజిఎల్, హెచ్‌డిఎల్, విడిఎల్, ఈసిజి, టుడిఎకో, టిఎంటి పరీక్షలు వైద్యుల సలహా మేరకు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. నంద్యాల శాంతిరాం హాస్పిటల్‌లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపాలనే సంకల్పంతో గతంలో కూడా వందల మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించినట్లు, సంతానం లేని వారికి ఉచిత వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధ్యక్షులు ప్రతాప్, ఈరన్న శెట్టి, రంగ, సభ్యులు రఘు, మహిళా విభాగ్ అధ్యక్ష, కార్యదర్శులు సంగీత, వంకదారు మమతశ్రీ, బిందు పాల్గొన్నారు.
కరపత్రాలను విడుదల చేస్తున్న నిర్వాహకులు










