ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌కు కొత్త సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా బాద్యతలు నిర్వహించారు. కాగా, ఎస్‌అండ్ పీ (అమెరికా స్టాక్ మార్కెట్ ఇండెక్స్) టాప్-500 కంపెనీల్లో యంగెస్ట్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఘనత సాధించారు. మెటా (గతంలో ఫేస్‌బుక్) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వయసు 37 ఏళ్లు. పరాగ్ వయసు కూడా 37 ఏళ్లే! అని రిపోర్టులు చెప్తున్నాయి. ఇద్దరి వయసు ఒకటే కావడంతో యంగెస్ట్ సీఈవో హౌదాలో ఈ ఇద్దరూ నిలిచినట్లు అమెరికా మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరుస్తున్నాయి. అయితే, . మరో భారతీయుడు అత్యున్నత పదవిలో కొలువుదీరడం విశేషం. ముఖ్యంగా... సెక్యూరిటీ కారణాలతో ఆయన పూర్తి ఐడెంటిటీని, ఇతర బయోడేటాను రివీల్ చేసేందుకు ట్విటర్ కంపెనీ అంగీకరించలేదు. అయితే పరాగ్ అగర్వాల్ 1984 ముంబైలో పుట్టినట్లు తెలుస్తున్నప్పటికీ... అధికారికంగా ఆయన వివరాలు వెలువడాల్సి ఉంది. టాప్ 500 కంపెనీల్లో బెర్క్‌షైర్ హత్‌వే సీఈవో వారెన్ బఫెట్(95) అత్యధిక వయస్కుడిగా నిలిచారు. ఇక 500 పెద్ద కంపెనీల సీఈవో జాబితాను పరిశీలిస్తే సగటు వయసు 58 ఏళ్లుగా ఉంది. డైరెక్టర్ల వయసు సగటున 63 ఏళ్లుగా ఉంది. కానీ, విశాల కోణంలో పరిశీలిస్తే చిన్నవయసు వాళ్లు సీఈవో అర్హతలకు దూరంగానే ఉన్నారు. అయితే ఇలాంటి సోషల్ మీడియా కంపెనీలను సమర్థవంతంగా నడిపేందుకు వయసు పెద్ద ఆటంకం కాకపోవచ్చని స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ డేవిడ్ లార్కర్ అభిప్రాయపడుతున్నారు. ట్విటర్ ఫౌండర్, సీఈవో జాక్ డోర్సే(45).. ఫైనాన్షియల్ సర్వీస్-డిజిటల్ పేమెంట్ కంపెనీ 'స్క్వేర్'కు సైతం సీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండింటి బాధ్యతలు నిర్వహించడం కష్టమవుతున్న నేపథ్యంలోనే ఆయన ట్విటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక పరాగ్‌కు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాక.. జాక్ డోర్సే ట్విటర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవచ్చనే అంటున్నారు. కానీ, 2022 వరకు(తన కాంట్రాక్ట్ ముగిసేవరకు) బోర్డులో మాత్రం మెంబర్‌గా కొనసాగనున్నాడు.
అగర్వాల్ విషయానికొస్తే.. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్, స్టాన్‌ఫోర్డ్‌లో పీహెచ్‌డీ చదువుకున్నారు. తాజా నియామకంపై ఆయన స్పందిస్తూ 'ఈ పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తా'నని తెలిపారు. డోర్సేకు కఅతజ్ఞతలు చెబుతూ.. 'మీ మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని ఆశిస్తున్నా'నని అన్నారు. పరాగ్‌ను ఈ స్థానంలో నిలబెట్టడానికి మూడు కారణాలున్నాయని డోర్సే అన్నారు. 'బోర్డు చాలా తీవ్రంగా వెతికింది. ఏకగ్రీవంగా పరాగ్‌ను ఎంచుకుంది. కొంత కాలంగా నా ఎంపిక కూడా అతడే. ఎందుకంటే కంపెనీని, కంపెనీ అవసరాలను అతను లోతుగా అర్థం చేసుకున్నాడు. ప్రతి కీలక నిర్ణయం వెనక పరాగ్ ఉన్నారు. ఈ కంపెనీ ఇలా మారడానికి కారణమయ్యారు. అంతే కాదు.. ఆసక్తి, హేతుబద్ధత, సఅజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయి. మనసు పెట్టి పనిచేస్తారు. మా సీఈఓగా నాకు అతనిపై అచంచల విశ్వాసం ఉంద'ని డోర్సే పేర్కొన్నారు.










