మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఇంక్ సీఈవో జాక్ డోర్సీ తన పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో నూతన సీఈవో ఎంపిక విషయమై జాక్ డోర్సీ, ట్విట్టర్ బోర్డు మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. జాక్ డోర్సీ బాధ్యతలను ఆ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ చేపట్టారు. అగర్వాల్ 2017 నుండి సిటివో గా ఉన్నారు. గతేడాది నుంచే డోర్సీని సీఈవోగా సాగనంపేందుకు ట్విట్టర్ బోర్డు సన్నద్ధమవుతున్నది. ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలగనున్నారన్న వార్తలపై స్పందించేందుకు సంస్థ అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు. అయితే, ఆయన వైదొలిగారన్న విషయమై గానీ.. ఆయన వారసుడెవరన్న విషయమై గానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే... డోర్సే 2022లో తన పదవీకాలం ముగిసే వరకు బోర్డులో కొనసాగుతారు. కాగా, డోర్సే 2007లో ట్విట్టర్ సిఇవోగా ఎంపికయ్యాడు. ఆ మరుసటి సంవత్సరం బలవంతంగా తొలగించబడినా, 2015లో తిరిగి సిఇవో పదవిని చేపట్టాడు .
డోర్సీ చివరి ట్వీట్ ...
ట్విట్టర్ సీఈవోగా డోర్సీ వైదొలుగుతారన్న వార్తల నేపథ్యంలో సంస్థ స్క్రిప్ట్ ప్రారంభంలో 11 శాతం పెరిగింది. డోర్సీ సారధ్యంలోని డిజిటల్ పేమెంట్స్ సంస్థ స్క్వేర్ ఇంక్ మూడు శాతం పెరిగింది. ఆదివారం తన చివరి ట్వీట్ లో.... ‘నేను ట్విట్టర్‌ను ప్రేమిస్తాను’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను సోమవారం 54 వేల మందికి పైగా లైక్ చేశారు. జాక్ డోర్సీ వైదొలగనున్నారన్న వార్తను ప్రముఖ చానెల్ సీఎన్‌బీసీ రిపోర్ట్ చేసింది.










