Mar 17,2023 16:33
  • రవాణా శాఖ అధికారల సంఘం డిమాండ్

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : కాకినాడలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.చిన్నారావుపై  దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రవాణా శాఖ అధికారుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణాశాఖ అధికారి పి సీతాపతి రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఎన్నడు జరిగినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్  కాకినాడలో శుక్రవారం ఉదయం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. వాహనానికి  కట్టాల్సిన శిస్తు బకాయిలు అడిగినందుకు రవాణా శాఖ అధికారి పై విశక్షణ రహితంగా దాడి చేయడం ఆందోళన కలిగించే అంశం అన్నారు.  ఉన్నతదికారులు అయిన జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీలు ఉండే ప్రాంతంలోనే ఇలా జరిగితే భవిష్యత్తులో అధికారులు ఏ విధంగా విధులు నిర్వహిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దురదృష్ట కర సంఘటనను నిరసిస్తూ నల్ల బ్యడ్జిలతో నిరసన తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ఠమైన  చర్యలు చేపట్టాలని దోషిని వెంటనే కఠినంగా శిక్షించినప్పుడే అధికారికి న్యాయం జరుగుతుందని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు నాయక్ సిద్ధిక్, సంజీవరావు, అసిస్టెంట్ రవాణా శాఖ అధికారులు సోనిప్రియ, ప్రణీత్ కుమార్, సత్యనారాయణ ,పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.