ప్రజాశక్తి-చిలమత్తూరు : చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్ సమీపంలోని జగనన్న కాలనీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి అందులోని రాగి తీగలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఉదయం అటుగా వెల్లిన స్థానికులు గుర్తించి విధ్యుత్ శాఖ అదికారులు తెలియజేశారు. ఈ మధ్య కాలంలో రైతులు పొలాల వద్ద ఏర్పాటు చేసిన స్టాటర్ లను దొంగలించారు. ట్రాన్స్ ఫార్మర్ ను దొంగలించడంతో రైతులు బెంబేలెత్తుత్తున్నారు.










