Sep 27,2023 12:21

ప్రజాశక్తి-పుట్లూరు : పట్టపగలే చోరీ జరిగిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి వివరాల మేరకు ఉదయం 8 గంటలకు పులివెందులలో ఫంక్షన్ ఉండగా భార్యాభర్తలు ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయలుదేరి వెళ్లిపోయారు. వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో చంద్రాన్ని పిలిచి పలకకపోవడంతో చుట్టూ పక్కల వారికి చెప్పడంతో వారు ఫంక్షన్ ఉందని వెళ్లారని  వాళ్ళ అమ్మకు తెలిపారు. వెంటనే కొడుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో బీరువాలను పగలగొట్టి వాటిలో ఉన్న 20  తులాల బంగారం 40 వేల డబ్బులు మరికొన్ని వస్తువులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.