ప్రజాశక్తి-శిoగరాయకొండ : శిoగరాయకొండలో పీడీసీసీ బ్యాంక్ ఎటిఎంని దొంగలు పగలుకొట్టారు. బ్యాంక్ అధికారులు పోలీసులకీ సమాచారం ఇవ్వడ0తో పోలీసుల రంగంలోకి దిగి ఏటీఎం వద్ద ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించి పగలగొట్టారని గుర్తించారు. ఏటీఎంలో నగదు విషయంపై వివరాలు వెల్లడిస్తామని బ్యాంకు పోలీస్ అధికారులు తెలిపారు.










