Jul 29,2023 15:45
  • మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి 
  • జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు, నియోజకవర్గ ఇంచార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి 
  • నియోజకవర్గ పరిశీలకురాలు శివబాల 

 ప్రజాశక్తి-మంత్రాలయం : మహిళలు ఆర్ధికంగా ఎదుగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, తెలుగు దేశం పార్టీ తోనే మహిళలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు, నియోజకవర్గ ఇంచార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి, నియోజకవర్గ పరిశీలకురాలు శివబాల అన్నారు. శనివారం ఆ పార్టీ నియోజకవర్గం ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు నరవ శశిరేఖ అధ్యక్షతన స్థానికంగా జరిగిన మహాశక్తి కార్యక్రమ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా శ్రీ మఠం చేరుకొని రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు, నియోజకవర్గం ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి తెలుగు దేశం పార్టీ నియోజకవర్గం పరిశీలకులు శ్రీమతి శివబాల మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా ఎదుగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని వారు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో మహిళలు కోసం ప్రకటించిన పధకాలను ప్రజలకు ముఖ్యంగా మహిళలకు వివరించాలని కోరారు. రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళకు ఆడబిడ్డ శ్రీ నిధి కింద 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 15 వందల రూపాయలు, దీపం పధకం పేరుతో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితముగా ఇస్తారని, తల్లికి వందనం పేరు తో ఇంట్లో ఎంత మంది చదివితే అంతమందికి తల్లి అకౌంట్ లో ఒక్కొక్కరికి 15 వేలు రూపాయిలు వేస్తారని, ప్రతి మహిళకు బస్సు ప్రయాణంలో ఉచిత ప్రయాణం కల్పిస్తారని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ చట్టం, పదవులలో సముచిత స్ధానం తెలుగు దేశం పార్టీ లోనే సాద్యం  అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి,తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, మండలం అధ్యక్షులు పన్నగ వెంకటేశ్ స్వామి, పెద్దకడూబురు మండలం అధ్యక్షులు బసలదోడ్డి ఈరన్న,తెలుగు రైతు జిల్లా కార్యదర్శి యల్లారెడ్డి, బిసి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నత్ రెడ్డి, అశోక్ రెడ్డి, తెలుగు మహిళ, మహాశక్తి ప్రోగ్రామ్ టిమ్ నాడిగేని నరసమ్మ, రూతమ్మ, సరోజమ్మ, శంకుతలమ్మ, వట్టెప్పగారి నరసింహులు, మేకల నరసింహులు, తిక్కస్వామి,తెలుగు యువత జిల్లా మీడియా కోర్డినేటర్ విజయ రామిరెడ్డి, నాడిగేని మహదేవ్, ముని, హనుమంతు,యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి యోబు, బోగ్గుల నరసన్న, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు, లక్ష్మారి చిదానంద,తదితరులు పాల్గొన్నారు.