ప్రజాశక్తి-పత్తికొండ : వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయాన్ని వైసిపి అడ్డుకోలేదని మాజీ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిని వెంకట రాముడు పేర్కొన్నారు. టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ పత్తికొండ పట్టణంలోని నాలుగు స్తంభాల కూడలి దగ్గర పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కే ఈ శ్యామ్ బాబు ఆధ్వర్యంలో బాబుకు మేము సైతం రిలే నిరాహారదీక్ష 22వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిన వెంకట్ రాములు మాట్లాడుతూ రాష్ట్రంలోని రాక్షస పాలన కొనసాగుతుందని, అక్రమంగా చంద్రబాబు అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై పైశాచాక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేపట్టిన భవిష్యత్తు గ్యారెంటీ, నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రజల నుంచి టీడీపీకి ఆదరణ పెరిగిందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు సంఘీభావంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు రిలే నిరాహారదీక్షలో సింగం శ్రీనివాసులు, రహంతుల్లా రంగస్వామి, నగేష్ కొత్తిరాళ్ల, శేఖర్, శ్రీనివాసులు నాయక్, దండు రంగన్న, దూదెకొండ మోహన్, మధ్యానమయ్య, వడ్డే పులికొండ, ఉలిగన్న, కొత్తిరాళ్ల రంగన్న, మహబూబ్ బాషా, కె భాస్కర్ చిన్నారులు మురారి, సంతోష్, మహిళలు ఈరమ్మ,లక్ష్మీదేవి, శాంత కుమారి ఉషారాణి, ముంతాజ్ బేగం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










