Sep 23,2023 13:07

ప్రజాశక్తి-పత్తికొండ : తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే విడుదల చేయాలని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పత్తికొండ పట్టణంలోని నాలుగు స్తంభాల కూడలి దగ్గర ఏర్పాటు చేసిన బాబుకి తోడుగా మేము సైతం రిలే నిరాహార దీక్ష పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అరాచక పాలన కొనసాగుతుందని, రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లోనే వైసిపి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రిలే నిరాహార దీక్షలో పట్టికొండ పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీకాంత్ చౌదరి కాకర్ల లక్ష్మీనారాయణ, చల్లా ప్రతాప్ చౌదరి,దోనాదుల రవీంద్రనాథ్ చౌదరి, చల్లా సునీల్ చౌదరి, ఆనంద్ లక్ష్మీనారాయణ, అంబటి శ్రీనివాసులు, నక్క గుర్రప్ప, పుత్తూరు చంద్రయ్య, వన్నూరు భాష, చాకలి వెంకట్రాముడు, బడి గింజల సుంకన్న,నంబూరు నారాయణస్వామి, మోదుపల్లి జయరాముడు తదితరులు పాల్గొన్నారు