ప్రజాశక్తి-ఆదోని: కక్ష సాధింపు ధోరణితోనే చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారని టిడిపి సీనియర్ నాయకులు సూరం భాస్కర్ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప సౌదీ రావుఫ్ సీఎం జగన్ పై మండిపడ్డారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సీఎం జగన్, కోడాలి నాని చిత్రపటాలను గాడిద, దున్నల మెడలో కట్టి ఆదోనిలోని శ్రీనివాస భవన్ ప్రాంతంలో నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సూరం భాస్కర్ రెడ్డీ, మన్వి దేవేంద్రప్ప సౌదీ రావుఫ్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబును అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నాడు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ పొందిన నేడు దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత చంద్రబాబు కోసం రోడ్లపైకి వస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజల్లో నిరసన వస్తున్న సీఎం జగన్ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా అక్రమ కేసులు బనాయించకుండా ఉండాలని కోరారు. అంబేద్కర్ విగ్రహంతో నిర్వహిస్తున్న దీక్ష శనివారంకు 19 రోజులకు చేరుకుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఫకృద్దీన్, సోమశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రామచంద్ర, మల్లికార్జున, శ్రీనివాసులు, మల్లేశ్వరప్ప, మద్దికేర, రామకృష్ణ, హుస్సేన్, నారాయణపురం షాషావలి, శీన, రామకృష్ణ, పకీరప్ప, రాముడు, మదిరె గోవిందా, రమేష్, నాగరాజు, పరమేష్, తిమ్మప్ప, శేకన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.










