ప్రజాశక్తి-ముసునూరు : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న దీక్షా శిబిరంలో సోమవారం వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహం పెట్టి త్వరలో రాక్షస పాలన అంతమొంది తెలుగుదేశం పాలన రావాలి అని పూజలు నిర్వహించారు. ముసునూరు మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మద్దతుగా నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, గదే రఘు బాబు,కొలి గంగా రామ్,మందలపు ధర్మరాజు, కందుల పిచ్చియ్య, మానురాజ్ సురేష్,నియోజకవర్గ తెదేపా నేతలతో కలిసి పాల్గొన్నారు.










