May 17,2023 17:29
  • ప్రజలు అన్ని గమనిస్తున్నారు : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 

             
             ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా)

బందరు నాటకాల రాయుడు,పేర్ని నాని  నీ నాటకాలు అన్ని కటీపెట్టు.. నీవు ఆడే నాటకాలన్ని ప్రజలు గమనిస్తున్నారని  రాబోయే ఎన్నికలలో నీ నాటకాలకు తెర దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు.
బుధవారం స్థానిక నియోజక వర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో రవీంద్ర మాట్లాడుతూ అసలు బందరు పోర్ట్ నిర్మించాలని అనుకుంటున్నావా బందరు బస్టాండ్ నిర్మించాలనుకున్నావా ముందు స్పష్టత ఇవ్వలన్నారు. ఎన్నికలకు అరు నెలలు ముందర నాటకాల రాయుడు నానికి బందరు  పోర్ట్ గుర్తుకొచ్చిందా అని  విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 6220 ఎకరాలతో పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశావు..?కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 5400 ఎకరాలతో పోర్టు నిర్మాణం అని ఒంటెలెక్కి ఊరేగావ్..? ఇప్పుడు జగన్ రెడ్డి తో 1800 ఎకరాల్లో పోర్టు నిర్మాణం అని పతివ్రత పరమాన్నం కబుర్లు చెబుతున్నావు.ఎన్ని సార్లు పోర్ట్  నిర్మాణం పేరుతో నాటకాలు ఆడతావ్,పోయిన సారి ఒంటెలెక్కి ఉరెగావు ,ఇప్పుడు ఏమెక్కి ఊరేగుతావో ప్రజలకు చెప్పాలన్నారు. పోర్ట్ నిర్మాణం కాకపోతే కోనేరు సెంటర్లో మోకాళ్ళ పై నిలబడి ముక్కు నెలకరాసి రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పవుగా  మరి ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ఇంకా ఎంతకాలం నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తావు ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల,పిషింగ్ హార్బర్ కు నువ్వేదో నిధులు తెచ్చినట్లు ప్రచారం చేసుకోవడానికి కొంచెం అయిన ఇంగితం ఉండాలన్నారు. అసలు వాటి రికార్డులు తీయండి ఎవరి హయాంలో  ప్రతి పాదనలు పంపోరో తెలుస్తుంది అని ఎద్దేవా చేశారు. బందరు అభివృద్ధి పై 22 వ తారీకు న జగన్ రెడ్డి సమక్షంలో వేదికపై చర్చకు నేను సిద్ధం దమ్ముంటే నువ్వు సిద్దమా..? అదే వేదికపై నీ అవినీతిని బండారం మొత్తం బయట పెడతా..?  అంటు సవాల్ విసిరారు. నీ అవినీతి చిట్టా నీ పార్ట్ నాయకులను   అడిగితే చాలు  కథలు కథలుగా చెబుతారన్నారు. నీ అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై  తప్పుడు విమర్శలు చేస్తూ  జగన్ రెడ్డి బజన చేస్తావని విమర్శించారు.రెండు లక్షల ట్రిప్పుల మట్టి దోపిడీ చేసి గొడౌన్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నవూ. ఇతర ప్రాంతాల్లో నువ్వు కొంటున్న భూములు అన్నిటి చిట్టా మా దగ్గర ఉందన్నారు. స్థానిక విలేకరులైతే  నీ బాగోతం బయట పడుతుందన్న భయంతో వేరే ప్రాంతం నుండి విలేఖర్ల ను రప్పించుకుని అసత్యలతో ప్రచారం చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.విలేకరుల జీవితాలు నాకు తెలుసు  చినిగిపోయిన బనియన్ లు వేసుకుంటారు అని ఏటకరం చేశావ్ ఒక్కవిలేకరికైన న్యాయం చేశావా. చెప్పాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్ష కార్యదర్శులు వెంకన్న,ఇలియాస్ పాషా, కార్పొరేటర్లు డి.అనిత,సమత కీర్తి, మరియు  కుంచె నాని,గోపు సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు