Jul 20,2023 16:42

ప్రజాశక్తి-ఆదోని : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా హైదరాబాదులో కలిసినట్లు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆదోని నియోజకవర్గం సీనియర్ నాయకులు మాన్వి దేవేంద్రప్ప బుధ‌వారం విలేక‌రుల‌కు తెలిపారు. ఆదోని నియోజకవర్గం ప్రజలు కొత్త నాయకున్ని కోరుకుంటున్నారని, ప‌రిశీలించి టికెట్ కేటాయిస్తే గెలిచి చూపిస్తామని, తన పైన నమ్మకం ఉంచి టికెట్ కేటాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఆదోని నియోజకవర్గం టికెట్ ఆశించే వారిలో తమ వివరాలు ఉన్నాయని పరిశీలిస్తామని బాబు తెలిపారని దేవేంద్రప్ప వివరించారు. ఆరు లక్షల జనాభా కలిగిన కురువ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుపు తధ్యమని బాబుకు వివరించినట్లు తెలిపారు.