ప్రజాశక్తి-మన్యం : తెలుగుదేశం పార్టీజాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ సంఘీభావంగా యువనేత వైరిచర్ల, వీరేష్ చంద్ర దేవ్ కురుపాం తెలుగుదేశం పార్టి కార్యాలయం నుంచి తోటపల్లి వరకు సైకిల్ యాత్ర గురువారం ఉదయం చేపట్టారు. గ్రూపు రాజకీయల కారణంగా ముఖ్య నాయకులు ఈ సైకిల్ యాత్రకు డుమ్మా కొట్టారు.










