Mar 29,2023 13:18

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా): నాడు ఢిల్లీ పాలకులనుండి తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి అన్న నందమూరి తారక రామారావు  తెలుగుజాతిని ఏకం చేసి ఢిల్లీ పాలనకు చేమగీతం పాడారని, నేడు మరొక్క సారి జగన్ రెడ్డి రాక్షస పాలన నుండి తెలుగువారిని రక్షించడానికి నారాచంద్రబాబు నాయకత్వములో తెలుగుజాతి పునరంకితం కావాల్సిన సమయం ఆసన్నమైందనీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర పిలుపు నిచ్చారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 41 సంవ‌త్స‌రాలు పూర్తిఅయిన సంద‌ర్భంగా బుధవారం మ‌చిలిప‌ట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర  మీడియాతో మాట్లాడుతూ తెలుగుజాతికి శుభోద‌యం, తెలుగు ప్ర‌జ‌ల‌కు శుభ‌దినం ఈ రోజు తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో పందిల‌మైందన్నారు. అన్న నంద‌మూరి తార‌క రామారావు తెలుగుదేశం పార్టీని 41 సంవ‌త్స‌రాల క్రితం ఇదేరోజు మార్చి 29వ తేది పార్టీని స్థాపించారని గుర్తు చేశారు .పేద‌వాడికి క‌ష్టం వ‌స్తే త‌న‌కు క‌ష్టం వ‌చ్చిన‌ట్టు భావించిన‌వాడని, అన‌గారిన వ‌ర్గాల‌ను అత్యంత‌గా ఆద‌రించిన‌వాడు, సామాన్యుల‌కు సాయం చేయ‌డ‌మే ఆశ‌యం ల‌క్ష్యంగా పెట్టుకున్న మ‌హోన్న‌త వ్య‌క్తి అన్న‌నంద‌మూరి తార‌క రామారావు  స్థాపించిన పార్టీ నేటికి 41వ‌సంతాలు పూర్తి అయిన సంద‌ర్భంగా తెలుగువారంద‌రికి నా సుభాభివంద‌నాలు తెలియజేస్తున్ననన్నారు. తెలుగుదేశం పార్టీని తెలుగుజాతిని ఎవ్వరూ విడదీయలేరని , తెలుగు ప్రజలు ఉన్న చోట టీడీపీ ఉంటుందని, తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరకాలం ఉంటారన్నారు., తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో పదిల‌మైన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి 18 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నామొక్కవోని ధైర్యంతో ప్రజల పక్షాన తెలుగు వారికోసం, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే నన్నారు.దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏ విలువల కోసం అయితే ఆనాడు పార్టీని స్థాపించారో అదే విలువలకోసం నేటికీ నిలబడి పోరాటం చేస్తున్న పార్టీ  తెలుగుదేశం పార్టీ అన్నారు. రాష్ట్రంలో పాలనా సంస్కరణలు తీసుకు వచ్చిన పార్టీ, మహిళలకు ఆస్తిలో సగం వాటా, మాండలిక వ్యవస్థలను కూడా తీసుకు వచ్చి పరిపాలనలో గొప్ప మార్పులను తీసుకు వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే అలాంటి ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఈనాడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇప్పటి అధికార పార్టీ ఎన్ని అరాచకాలు చేస్తున్నా కార్యకర్తలు ప్రాణాలొడ్డి తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకున్న ఘనత కూడా కార్యకర్తలకే దక్కుతుంద‌న్నారు. కానీ నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసంతో ఫారంభమై, రివర్స్ టెండర్ల తో పాలనని రివర్స్ లో నడిపిస్తూ ఈనాడు ఒక్క ఇటుక కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏవిధంగానైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటూ వచ్చారో మళ్లీ తిరిగి చంద్రబాబు నాయుడు లోకేష్ నాయకత్వంలో పార్టీని కొత్తపుంతలు తొక్కించడానికి సిద్ధంగా ఉన్నార‌న్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలించిన చంద్రబాబుకు ప్రజలు మరోసారి పట్టం కడతారని , రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి అందరూ సైనికుల్లా పనిచేయాలని, రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాల‌ని కొల్లు రవీంద్ర కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిపల్ మాజీ చర్మన్ ఎం వి,బాబా ప్రసాద్,పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వెంకన్న,ఇలియాస్ పాషా,పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ప్రజాప్రతినిధులు మహిళా నాయకులు , డివిజ‌న్ ఇన్‌చార్జ్‌లు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.