Sep 15,2023 21:31

వినతులు స్వీకరిస్తున్న జెసి గోవిందరావు

బలిజిపేట: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమర్పించిన ఆర్జీలకు త్వరితగిన పరిష్కారమే ధ్యేయమని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. మండల స్థాయి సమస్యలు మండలంలోనే పరిష్కారం కావాలనే లక్ష్యంతో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగింది. జిల్లా అధికారులంతా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌ స్థాయిలో మండలాల్లో నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. మండల ప్రజలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతులు సమర్పించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవిందరావు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 57 ఆర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.