Sep 21,2023 00:42

స్టేట్మెంట్‌ తీసుకుంటున్న ఆర్‌ఐ

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:గిరిజనేతరుడుకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రం జారీపై ఆదివాసీ గిరిజన సంఘం పిర్యాదు మేరకు బుదవారం తూతూమంత్రంగా అధికారులు విచారణ జరిపారు. విచారణ అధికారిగా తహశీల్దార్‌ ఎ వేణుగోపాల్‌ను నియమించారు. తనకు ఏమి సంబంధం లేనట్లు ఆయన వ్యవహరించారు. పిర్యాదుదారులు ఎదుట విచారణ, స్టేట్మెంట్‌ తీసుకోవాల్సిన తహశీల్దార్‌ పట్టించుకోలేదు. పిర్యాదుదారులు లేకుండా ఆర్‌ఐ నకిలీ ఎస్టీ కుల ద్రువీకరణ పత్రం తీసుకున్న పిట్టల రాంబాబు నుండి స్టేట్మెంట్స్‌ తీసుకున్నారు. విచారణకు హాజరైన ఎస్టీ భగత్‌ కుల ద్రువీకరణ పొందిన పిట్టల రాంబాబు ఎటువంటి ఆధారాలు లేకుండా హాజరయ్యారు. ఎస్టీ నకిలీ జారీ పై విఆర్‌ఓ ఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ, పిట్టల రాంబాబు ఇంటికీ తాను వెళ్లగా స్టీ కుల చెందిన వారని వాలంటీర్‌ చెప్పారని తెలిపారు.
క్రిమినల్‌ కేసు పెట్టాలి:
ఆదివాసీ గిరిజన సంఘం
గిరిజనేతరుడుకు నకిలీ ఎస్టీ భగత కుల ధ్రువీకరణ పత్రం పొందిన పిట్టల రాంబాబు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, క్రిమినల్‌ కేసు పెట్టాలని నకిలీ ధ్రువపత్రం జారీ చేసిన రెవిన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈ నెల 12న విచారణ చేసినప్పటికీ సరైన ఆధారాలు లేని కారణంగా విచారణ వాయిదా వేశారని బుధవారం కుడా సరైన ఆధారాలు తీసుకురాలేదన్నారు. దీనిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పిర్యాదుదారులు లేకుండా స్టేట్మెంట్‌ తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. బాధ్యులైన పిట్టల రాంబాబు కు సరైనా ఆధారాలతో హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన తహశీల్దార్‌ నేటికి చర్యలు తీసుకోక్కపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.నకిలీ కుల ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో వాలంటర్‌ క్షేత్రస్థాయి నుండి రెవిన్యూ ,మండల తహశీల్దార్‌ వరకు ముఖ్య పాత్ర పోషించారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అరకువేలి మండలం పెదలబుడు పంచాయతీ కొండవీది, శరభగుడ, కంటబౌంసుగుడ, జడ్పీ కాలనీ, సి కాలనీ, పద్మ పురం పంచాయితి సంతోష్‌ నగర్‌, ఎండపల్లి వలస టీచర్స్‌ కోలని పరిధిలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పలువురు పొందారని, తక్షణమే అధికారులు ధీనిపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసి గిరిజన హక్కులు, చట్టాలు కాపాడవలసిన అధికారులు కాలరాస్తున్నారని అన్నారు. నకిలీ కుల ద్రువీకరణ పత్రం తీసుకున్న బాధ్యులు పై జారీ చేసిన రెవిన్యూ సిబ్బంది పై క్రిమినల్‌ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ విచారణలో ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు జి.బుజ్జిబాబు, జన్ని భగత్‌ రామ్‌ ( పద్మాపురం ఉపసర్పంచ్‌) ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కిల్లో జగనాదం, కొర్రా మగ్గన్న,కిండంగి రామారావు, మాజీ ఎంపీటిసీ బి కోగేష్‌, కిల్లో సహదేవ్‌, పి రాము,ఎపిఎస్‌ జిల్లా కార్యదర్శి చట్టు మోహన్‌ , హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా నాయకులు ఎం రమేష్‌ పాల్గొన్నారు.