May 04,2023 22:09

వేణుగోపాలరావు సన్మానిస్తున్న ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది

ప్రజాశక్తి - పరిగి : నాలుగు సంవత్సరాలుగా దివ్య ఎడ్యుకేషన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా విద్యా వైద్యం రంగాలలో ఇటు విద్యార్థులకు అటు వైద్యశాలలకు అవసరమైన సేవలు అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఈ సేవలను కొనసాగిస్తామని నిర్వాహకులు పరిగి వేణుగోపాలరావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల నుండి వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణులకు ప్రతి గురువారం భోజన వసతి కల్పించి వారికి అవసరమయ్యే మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో భాగంగా వారి సౌకర్యార్థ ఐదు సీటింగ్‌ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో ఆసుపత్రి ముందు రూ. 80వేలతో షెడ్డు ఏర్పాటు చేశామని వీటికి మరికొంత అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు స్వరూప రెడ్డి, వన్నప్ప తదితరులు పరిగి వేణుగోపాలరావుని సన్మానించి ట్రస్ట్‌ సేవలను కొనియాడారు.