Oct 20,2023 23:55
మొక్కలు నాటుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-త్రిపురాంతకం: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా త్రిపురాంతకేశ్వర ఆలయం, బాల త్రిపుర సుందరీ దేవి ఆలయాల్లో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌, ఆయన ధర్మపత్ని, డైరెక్టరర్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ విజయకృష్ణన్‌లు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌, ఈవో చెన్నకేశవరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.