సస్పెన్షన్ అయిన ఎఇ శాంతారావు
మక్కువ: మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పోలాకి శాంతారావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. గత నెల 27న ఎసిబి దాడి ఘటన అనంతరం జరిగిన అనూహ్య పరిణామాల తర్వాత ఎఇ శాంతారావు శనివారం విధుల్లోకి చేరిన విషయం విదితమే. అయితే ఎఇని మూడు నెలల పాటు సస్పెన్షన్ చేసినట్లు తెలియవచ్చింది. ఎసిబి కేసు నమోదు చేయడం సస్పెన్షన్‌నకు గల కారణంగా తెలుస్తుంది. ఏది ఏమైనా శాంతారావు వ్యవహారం ట్విస్టులకు దారితీసింది.










