Oct 14,2023 21:10

బస్సును వెనుక నుంచి ఢకొీన్న కారు

సాలూరు: మండలంలోని మామిడిపల్లి సమీపానగల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వద్ద శనివారం జరిగిన సంఘటన లో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢకొీట్టింది. పాఠశాల వద్ద ప్రయాణికులను దించేందుకు బస్సును ఆపగా వెనుక వస్తున్న కారు అదుపుతప్పి బస్సుని ఢకొీట్టింది. ఈ సంఘటనలో కారు ముందు భాగం దెబ్బ తిన్నది. ఇందులో ఉన్నవారెవరికీ గాయాలు తగల్లేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.