ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
తపాలా సేవలపై అవగాహన
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:తపాలా శాఖ ద్వారా అందుతున్న సేవలపై మండలంలో బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఇస్కపాలెం సబ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా తూర్పు సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ తపాలా శాఖ అందిస్తున్న సేవలను వివరించారు. గ్రూప్ యాక్సిడెంట్, గాడ్ పాలసీ, తపాలా శాఖ ద్వారా అందుతున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల పై బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన''జనంలోకి మనం''పథకం ప్రాధాన్యతను తెలియజేశారు. ఐపి పి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ డోలేంద్ర ఇన్సూరెన్స్ పథకాలు, వాటి ప్రయోజనాలను వివరించి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. తపాలా ఉద్యోగుల ఆధ్వర్యంలో జనంలోకి మనం నిర్వహించిన ర్యాలీ ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ ఇంగిలాల నిర్మలమ్మ , సబ్ పోస్టు మాస్టర్‌్ ఎం.కష్ణారావు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంకు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.










